AAP : దేశంలో ఎక్కడా లేని రీతిలో కొన్ని ప్రాంతాలలో మత ఘర్షణలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ , కర్ణాటక, యూపీతో పాటు ఢిల్లీలో సైతం అల్లర్లు చోటు చేసుకున్నాయి.
తాజాగా ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ గుంపుపై రాళ్లు రువ్వారు. అది కాల్పుల దాకా వెళ్లింది. ఈ తరుణంలో 14 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు ప్రధాన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP )అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ పార్టీ చీఫ్ ఆదేశ్ గుప్తా దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ఆప్ అని మండిపడ్డారు.
రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ నివాసానికి ఆప్ ప్రభుత్వం సహాయం చేసిందంటూ నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో 16న శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ సబ్ ఇన్స్ పెక్టర్ కు బుల్లెట్ గాయం అయ్యింది. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేశారు.
ఈ ఘటనలో అరెస్ట్ అయిన వీరిని బెయిల్ పై తీసుకు వచ్చారు. కార్యకర్తలను సత్కరించింది బీజేపీ. దీనిని తప్పు పట్టింది ఆప్ . ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు.
ఢిల్లీ హింసాకాండలో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు గాయపడడం సంచలనం కలిగించింది. ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు.
Also Read : హుబ్లీలో అల్లర్లు 144 సెక్షన్ విధింపు