AAP Slams : రైల్వే మంత్రికి బాధ్యత లేదా – ఆప్
అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సిందే
AAP Slams : ఒడిశాలో చోటు చేసుకున్న ఘోరమైన కోరమాండల్ రైలు ప్రమాదంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వందే భారత్ అంటూ ప్రచారం చేసుకుంటున్న కేంద్రం అసలు రైల్వేల భద్రత, సామర్థ్యంపై దృష్టి పెట్టలేదని ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ(AAP). ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ పూర్తిగా బాధ్యత వహించాలని, ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మానవ తప్పిదం తప్ప సాంకేతిక లోపం కాదన్నారు.
విజేతలతో సెల్ఫీలు, ఫోటోలు దిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఘటన గురించి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా యాంటీ డివైజ్ ఏర్పాటు చేసి ఉండి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం వద్ద కానీ , సంబంధిత రైల్వే శాఖ మంత్రి వద్ద కానీ ఎంత మంది చని పోయారు, ఎంత మంది తీవ్ర గాయాలైన పూర్తి వివరాలు లేవని ఆరోపించారు. ఇదెక్కడి ప్రభుత్వమని ప్రశ్నించారు.
ఒక్క రైల్వే శాఖలోనే 3,30,000 ఖాళీలు ఉన్నాయని , వాటిలో సగం భద్రతకు సంబంధించినవే ఉన్నాయని వెల్లడించారు. ఇక రైల్వేలలో ప్రయాణం చేసే వారికి ఎలా సెక్యూరిటీ కల్పిస్తారంటూ ప్రశ్నించారు. పూర్తిగా కేంద్రానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
Also Read : CM Siddaramaiah : హామీల అమలుకు సీఎం పచ్చజెండా
