AAP Support : భారీ వర్షం సహాయ చర్యల్లో ఆప్ నిమగ్నం
ఢిల్లీని ముంచెత్తిన వాన..యమునా నది ఉగ్రరూపం
AAP Support : ఉత్తరాది భారీ వర్షాల తాకిడికి వణుకుతోంది. ఇప్పటి వరకు తీవ్రమైన వర్షాల ధాటికి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. హర్యానా , ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే యమునా , గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో చుట్టు పక్కల ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇంటి దాకా నీళ్లు వచ్చాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఆప్ కన్వీనర్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్.
గత కొన్ని రోజులుగా వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాల కారణంగా 22 మందికి పైగా వివిధ ప్రాంతాలలో ప్రాణాలు కోల్పాయారు. గురువారం ఢిల్లీలోని మార్ఘాట్ లోని హనుమాన్ దేవాలయం సమీపంలో వరద ఉధృతి పెరిగింది. పొంగి ప్రవహిస్తుండడంతో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కార్యకర్తలు సహాయక చర్యలలో మునిగి పోయారు. ముంపునకు గురవుతున్న వారిని ఇప్పటికే ఆప్ సర్కార్ రక్షించింది.
వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు సీఎం కేజ్రీవాల్.
ఆప్ కు చెందిన ఎమ్మెల్యేలు సైతం సహాయక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.
Also Read : RS Praveen Kumar : పల్లెల్లో అత్యాధునిక జిమ్ లు – ఆర్ఎస్పీ