Abhishek Singhvi : సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు
రాహుల్ కేసుపై కాంగ్రెస్ పార్టీ
Abhishek Singhvi : మోదీ పరువు నష్టం కేసుకు సంబంధించి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి మరోసారి వెసులుబాటు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది గుజరాత్ లోని సూరత్ కోర్టు. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ తీర్పు పూర్తిగా భారత రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు విరుద్దంగా ఉందంటూ పేర్కొంది. ఇవాళ కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ.
ఇదిలా ఉండగా పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి కోర్టు రిలీఫ్ ఇవ్వక పోవడం కీలకంగా మారింది. ఈ సందర్భంగా సూరత్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పుతో కూడుకున్నదని, అది నిలకడ లేనిదంటూ పేర్కొంది. పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉపశమనం కోసం గాంధీ చేసిన దరఖాస్తును అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగేరా కోర్టు తిరస్కరించింది.
సమీప భవిష్యత్తులో చట్టానికి అనుగుణంగా తీర్పును సవాల్ చేస్తామని స్పష్టం చేశారు అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) . చట్ట పరమైన స్థితి లేకుండా తీర్పు తప్పు అని వాదిస్తూ మోడీ ఇంటి పేరుతో ప్రధాని మోడీతో పాటు 13 కోట్ల మంది ఇతరుల పరువు తీశారని కోర్టు గుర్తించిందని పీఎంఓ కార్యాలయం. పీఎంఓ ఒత్తిడి మేరకు ఈ తీర్పు వెలువరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు సింఘ్వి.
Also Read : ఉగ్ర మూకల ఘాతుకం దారుణం