ABVP Leaders Attack : పోలీసులపై ఏబీవీపీ కార్యకర్తల దాడి
వీసీ, రిజిస్ట్రార్ కు తీవ్ర గాయాలు
ABVP Leaders Attack : ఏబీవీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. గోరఖ్ పూర్ క్యాంపస్ లో వైస్ ఛాన్స్ లర్ రాజేష్ సింగ్(Rajesh Singh) , రిజిస్ట్రార్ అజయ్ సింగ్ లపై దాడికి దిగారు. ఈ దాడిలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అడ్డుకోబోయిన పోలీసులపై ఇష్టానుసారంగా దాడికి పాల్పడడం కలకలం రేపింది.
ABVP Leaders Attack Issue
దీన్ దయాల్ ఉపాధ్యాయ గోరఖ్ పూర్ విశ్వ విద్యాలయంలో ఫీజుల పెంపు, ఇతర సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. క్యాంపస్ వెలుపల నుండి వచ్చిన వ్యక్తల బృందం వైస్ ఛాన్స్ లర్ తో పాటు ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యారు పోలీసులు. వారిని కూడా ఏబీవీపీ నేతలు అడ్డుకున్నారు. వారిని కూడా ఇష్టానుసారంగా దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
జూలై తొలి వారం నుంచి విద్యార్థులు నిరసన బాట పట్టారు. తమను యూనివర్శిటీ క్యాంపస్ లోకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు వీసీ, రిజిస్ట్రార్ ఒప్పుకోలేదు. దీంతో నిరసన ఉద్రిక్తతకు దారి తీసినట్లు సమాచారం. సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఖాకీలపై దాడికి దిగారు. వీసీ, రిజిస్ట్రార్ పై కూడా దాడికి పాల్పడడం కలకలం రేపింది.
Also Read : DK Shiva Kumar No 1 : దేశంలోనే నెంబర్ వన్ శివకుమార్