ABVP Flag March : శ్రీనగర్ లో వందేమాతరం భారత పతాకం
వందే మాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలు
ABVP Flag March : భారతీయ జనతా పార్టీకి చెందిన విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అరుదైన ఘనత సాధించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జాతీయ పతాకాన్ని తయారు చేశారు.
ప్రత్యేకించి గణతంత్ర దినోవ్సం జనవరి 23 గురువారం రోజున శ్రీనగర్ లో 100 అడుగుల మువ్వొన్నెల భారతీయ పతాకంతో(ABVP Flag March) ఏబీవీపీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఇప్పటికే దాడులతో, కాల్పులతో దద్దరిల్లుతున్న ఈ ప్రాంతంలో ఏబీవీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సైతం భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆయన కూడా జమ్మూలో పాదయాత్ర పూర్తయింది. శుక్రవారం నాడు కాశ్మీర్ లోకి ఎంటర్ అవుతుంది. ఓ వైపు కాల్పుల మోత మరో వైపు ఖాకీల కదలికలతో ఒక్కసారిగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాశ్మీర్ లో నెలకొన్న తరుణంలో అత్యంత ధైర్య సాహసానికి పూనుకుంది ఏబీవీపీ.
ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏబీవీపీ(ABVP Flag March) కార్యకర్తలు పాల్గొన్నారు. అంతే కాదు శ్రీనగర్ వీధులన్నీ వందేమాతరం , భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తారు. ఏబీవీపీ కార్యకర్తలు షేర్ ఎ కశ్మీర్ పార్క్ నుండి లాల్ చౌక్ లోని ఐకానిక్ క్లాక్ టవర్ దాకా కవాతు నిర్వహించారు.
ప్రశాంతంగా ర్యాలీ ముగిసింది..భారీ ఎత్తున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీవీపీ కాశ్మీర్ లో ఓ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Also Read : కాశ్మీర్ లో కాలు మోపనున్న రాహుల్ గాంధీ