Chandrababu Naidu : బాబుకు షాక్ విచారణ వాయిదా
19కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Chandrababu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. బాబు తరపున వేసిన రెండు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu Naidu Case Viral
ఈ మేరకు ఈ విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బయటకు రావాలని తహ తహ లాడుతున్న చంద్రబాబుకు(Chandrababu Naidu) కోలుకోలోని దెబ్బ పడినట్లయింది. ఇప్పటికే చంద్రబాబు ఏపీ స్కిల్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఉన్నాడని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఆయనను నంద్యాలలో ఉండగా అదుపులోకి తీసుకు వచ్చింది.
అక్కడి నుంచి సీఐడీ ఆఫీసులో 20 ప్రశ్నలు సంధించింది. దీనికి సంబంధించి ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని ఆరోపించింది. ఆయనను ఏసీబీ కోర్టులో హాజరు పర్చింది. ఏపీ సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదించారు.
ఇక చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాతో పాటు వెంకటేశ్వర్ రావు వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏసీబీ కోర్టు జడ్జి బీఎస్వీ హిమ బిందు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read : TDP Janasena Comment : ఉమ్మడి పోరాటం జగన్ పై యుద్దం