SP Velumani : ఏసీబీ జూలు విదిల్చింది మరోసారి. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి ( SP Velumani)బిగ్ షాక్ ఇచ్చింది అవినీతి నిరోధక శాఖ – ఏసీబీ.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాదాపు రూ. 58.23 కోట్లు కూడబెట్టారంటూ ఏసీబీ ఫోకస్ పెట్టింది.
వేలుమణి మంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడుతో పాటు కేరళలో సైతం పలు చోట్ల విస్తృతంగా దాడులు చేపట్టారు. పది సంవత్సరాల పాటు డీఎంకే సర్కార్ లో నగర అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
పదవిని అడ్డం పెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో గత ఏడాది ఆగస్టు 10న వేలుమణి ఆస్తులపై ఏసీబీ దాడులు చేపట్టారు. దాదాపు 60 చోట్లకు పైగా తనిఖీలు చేపట్టాయి ఏసీబీ.
రూ. 2 కోట్లు విలువైన ఆస్తి పత్రాలు, రూ. 13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో వేలుమణి అనుచరులపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. వారిపై కూడా కేసులు నమోదు చేసింది.
చెన్నై, కోయంబత్తూరు, సేలం, కృష్ణ గిరి, తిరువత్తూరు, నామక్కల్ జిల్లాలోని ఇళ్లు, ఆఫీసులు, సంస్థలు, బినామీ ఇళ్లలో దాడులకు( SP Veluman) పాల్పడ్డారు. భారీగా 200 మంది ఈ దాడులలో పాల్గొనడం విశేషం.
వేలుమణి స్వంత ప్రాంతంలోని 40 చోట్ల తనిఖీలు చేపట్టారు. చెన్నైలో ఎనిమిది చోట్ల, సేలంలో నాలుగు చోట్ల, నామక్కల్, కృష్ణగిరి, తిరువత్తూరు, తిరుప్పూరు జిల్లాల్లో దాడులు చేపట్టారు.
రూ. 58.23 కోట్ల ఆస్తులను గుర్తించి వేలుమణి ( SP Velumani)సహా 10 మందిపై కేసులు పెట్టారు. కాగా కావాలనే డీఎంకే తమపై దాడులకు పాల్పడుతోందని అన్నాడీఎంకే
ఆరోపించింది.
Also Read : సోనియానే కాంగ్రెస్ కు దిక్కు