ACB Raids : మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు
మహేందర్ రెడ్డినా మజాకా 15 చోట్ల సోదాలు
ACB Raids : నల్లగొండ జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది రెవిన్యూ వ్యవస్థ. ఇప్పటికే ఈ శాఖపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కోట్లకు పడగలెత్తుతున్నారన్న విమర్శలు లేక పోలేదు.
ACB Raids in Thasildar House
తాజాగా లెక్కకు మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో మర్రిగూడ తహసిల్దార్ గా పని చేస్తున్న మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేసింది. దీంతో విస్తు పోయేలా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఏకంగా ట్రంక్ పెట్టె నిండా నోట్ల కట్టలను దాచి ఉంచడాన్ని గుర్తించారు ఏసీబీ(ACB) అధికారులు.
తహసీల్దార్ ఆఫీసులో దాడులు చేపట్టారు. మహేందర్ రెడ్డి నివాసం ఉంటున్న హైదరాబాద్ లో దాడి చేస్తే నోట్ల కట్టలు దర్శనం ఇచ్చాయి. ఈ దాడుల్లో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. దీంతో విస్తు పోయారు ఏసీబీ ఆఫీసర్స్.
అంతే కాదు కిలోల కొద్దీ బంగారం కూడా లభ్యమైందని తెలిపింది ఏసీబీ. మహేందర్ రెడ్డికి సంబంధించి 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది.
Also Read : Pawan Kalyan Comment : జనసేనాని వ్యూహం ఏంటి ..?