DGCA : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) సంచలన ప్రకటన చేసింది. వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికుల పట్ల ఆయా విమానయాన సంస్థలు అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్యాసింజర్స్ కు బోర్డింగ్ ను తిరస్కరించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వీటిని పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ(DGCA )సీరియస్ అయ్యింది.
ఏ విమానయాన సంస్థ అయినా , అది ఏ దేశానికి చెందినదైనా ఆయా ఎయిర్ పోర్టులతో పాటు ఫ్లైట్స్ నడిపే సంస్థలకు కీలకం ప్రయాణికులు. వాళ్లు లేక పోతే , ప్యాసింజర్లు ప్రయాణం చేయక పోతే మనుగడ కష్టం అవుతుందని గుర్తించాలని హెచ్చరించింది డీజీసీఏ.
ప్రధానంగా సంచలన కామెంట్స్ చేసింది. విమానయాన సంస్థలు ప్రయాణీకులకు బోర్డింగ్ ను నిరాకరించే అన్యాయమైన ఆచరణలో మునిగి పోయాయని పేర్కొంది ఏవియేషన్ రెగ్యులేటర్ సంస్థ.
తాము జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం ఆర్తిక జరిమానాలు విధించడంతో పాటు తప్పు చేసిన ఎయిర్ లైన్ పై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
సమయానికి ఎయిర్ పోర్ట్ లో రిపోర్టింగ్ చేసినప్పటికీ లేదా విమానాల రద్దు లేదా ఆలస్యం జరిగినప్పుడు బోర్డింగ్ నిరాకరించిన ప్రయాణీకులకు పరిహారం, సౌకర్యాలను అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానాలను ఆదేశించింది.
విమానయాన సంస్థలు ప్యాసింజర్స్ పట్ల ఇలా వ్యవహరిస్తే విమానయాన పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని డీజీసీఏ తీవ్ర స్థాయిలో మండి పడింది.
Also Read : మళ్లీ పెరిగిన వంట గ్యాస్ మంట