Mano Bala Died : కమెడియన్ మనోబాల కన్నుమూత
శోక సంద్రంలో తమిళ చిత్ర పరిశ్రమ
Mano Bala Died : ప్రముఖ కమెడియన్ నటుడు, దర్శకుడు మనోబాల(Mano Bala Died) చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతితో గొప్ప నటుడిని కోల్పోయింది. తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో నెలకొంది. కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. మనో బాల 35 ఏళ్ల సినీ కెరీర్ లో 450కి పైగా సినిమాల్లో నటించారు. మెప్పించారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
చెన్నైలోని తన స్వంత నివాసంలో తుది శ్వాస విడిచారు. సాలిగ్రామం ఎల్ వి ప్రసాద్ రోడ్డు లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు జీఎం కుమార్ మొదటగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మనో బాల ఇక లేరని .
మనో బాల 1979లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా తీసిన పుతియ వార్పుగళ్తో చిత్రంలో మొదటి సారిగా నటించారు. ఆ తర్వాత మనో బాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొన్నేళ్లుగా కమెడియన్ గా అలరిస్తూ వచ్చాడు. కమల్ హాసన్ సూచన మేరకు భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్టీలో మనో బాల చివరి సారిగా తెరపై కనిపించారు.
కామెడీ పాత్రలలో జీవించాడు. ప్రముక కమెడియన్ గా పేరు పొందాడు. 1982లో ఆగయ గంగైతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 25 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని టెలివిజన్ సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించాడు.
Also Read : ప్రియాంక నటనకు మహీంద్రా కితాబు