Samantha Yashoda : య‌శోద విజ‌యం స‌మంత సంతోషం

ఆద‌రించినందుకు ఆనందంగా ఉంది

Samantha Yashoda : అనుకోని వ్యాధికి గురై తీవ్ర మ‌న‌స్థాపానికి లోనైన న‌టి స‌మంత‌కు(Samantha Yashoda) దేవుడు క‌రుణించాడు. తాను తాజాగా న‌టించిన య‌శోద సినిమాకు ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో తెగ సంతోషానికి లోన‌వుతోంది స‌మంత‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని శ‌నివారం పంచుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మాన‌సికంగా ఇబ్బందికి లోనైన ఈ త‌రుణంలో ఇలాంటి స‌క్సెస్ రావ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగించిందంటూ పేర్కొంది. హ‌రి హ‌రీష్ య‌శోద మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త వారం రోజుల కింద‌ట ఈ చిత్రం విడుద‌లైంది.

రిలీజ్ అయిన అన్ని చోట్లా మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. అంతే కాదు స‌మంత ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుతూ ఆమె అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇదే స‌మ‌యంలో య‌శోద చిత్రానికి పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని త‌న భుజాల మీద వేసుకుంది స‌మంత‌.

ఓ వైపు అనారోగ్యం పీడిస్తున్నా లెక్క చేయ‌కుండా చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరింది. ప్ర‌స్తుతం త‌న మ‌న‌స్సు గాల్లో తేలుతున్న‌ట్లుగా ఉందంటూ పేర్కొంది. య‌శోద సినిమాపై మీరు చూపిస్తున్న ఆద‌ర‌ణ‌, ప్రేమను తాను మ‌రిచి పోలేక పోతున్నాన‌ని స్ప‌ష్టం చేసింది స‌మంత‌. కురిపిస్తున్న ప్ర‌శంస‌లే త‌న‌కు మ‌రిచి పోలేని బ‌హుమ‌తులు అంటూ పేర్కొంది .

అంతే కాకుండా యశోద స‌క్సెస్ కు కార‌ణ‌మైన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపింది స‌మంత‌.

Also Read : త‌లైవా’ అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!