Actor Vijay : తమిళనాడు సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు విజయ్. ఆయనను అభిమానులు ముద్దుగా తళపతి అని పిలుచుకుంటారు. రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డమ్ ను అందిపుచ్చుకున్న నటుడు విజయ్. ఇతర నటులు వేరు విజయ్ వేరు. ఆయన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ పోతాడు. ఆ మధ్యన రాజకీయాల్లోకి కూడా వస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో విరమించుకున్నాడు.
కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తీసుకు వచ్చిన జీఎస్టీపై సర్కార్ సినిమా ద్వారా నిలదీశాడు. ఆపై ప్రశ్నించాడు. తన ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్(Vijay) ని తమ స్వంత బిడ్డ కంటే ఎక్కువగా, తమ కుటుంబాల్లో సభ్యుడిగా భావిస్తారు తమిళులు.
ఇక తళపతి విజయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. లియో పేరుతో సినిమా త్వరలో రాబోతోంది కూడా. మరో వైపు దక్షిణాదిలో అత్యధిక పారితోషకం (రెమ్యూనరేషన్ ) అందుకునే నటుల్లో టాప్ లో ఉన్నాడు విజయ్. ఆయన ఆపద సమయాల్లో ఆదుకోవడంలో ముందుంటారు. అంతే కాదు ప్రతి ఏటా తమిళనాడు రాష్ట్రంలో 10వ తరగతి, 12వ తరగతి, ఇతర కోర్సుల్లో టాప్ లో నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు , నగదు బహుమతులు ఇస్తారు. తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పిల్లలతో సరదాగా గడిపారు విజయ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి నెట్టింట్లో.
Also Read : Weather Forecast AP TS : 19 నుంచి వర్షాలు కురిసే ఛాన్స్