Jayasudha : కాషాయం గూటికి జయసుధ
ఆమె బాటలో మరికొందరు
Jayasudha : తెలంగాణలో ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ పాగా వేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు భావ సారూప్యత కలిగిన వారందరినీ తమ పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తోంది.
సమాజాన్ని ప్రభావితం చేసే సినీ, వ్యాపార, వాణిజ్య, ఉన్నత వర్గాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన ఈటల రాజేందర్ కు ఈ పనిని అప్పగించింది కేంద్ర హైకమాండ్. త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది.
సామాజిక, రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తోంది.
ఆయా పార్టీలలో తీవ్ర అసంతృప్తితో ఉన్న వాళ్లను, ఆదరణకు నోచుకోని వాళ్లతో పాటు మేధావులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులను చేర్చుకునేందుకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతోంది కాషాయ దళం. తాజాగా ప్రముఖ సినీ నటి జయసుధ(Jayasudha) బీజేపీలో చేరనున్నారు.
ఈనెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల ఆమెను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుమన్ ,
భానుచందర్ తో పాటు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లను చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రజా సంఘాలను కూడా పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించేలా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈటల రాజేందర్.
రాబోయే రోజుల్లో మరికొందరిని చేరనున్నట్లు సమాచారం.
Also Read : వజ్రోత్సవాల వేళ ‘పతకాలు’ కళ కళ