Arvind Kejriwal : నోట్లపై లక్ష్మి..గణపతిలను చేర్చితే బెటర్
ప్రధాన మంత్రి మోదీపై కేజ్రీవాల్ సెటైర్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరోసారి కేంద్ర సర్కార్ ను ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఆయన గత కొంత కాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి దేశాన్ని పూర్తిగా హిందూ భావజాలంతో నింపడాన్ని తప్పు పడుతున్నారు.
హిందూత్వం వేరు హిందూ భావజాలం వేరు అన్న చర్చ పెద్ద ఎత్తున దేశంలో జరుగుతోంది. ప్రస్తుతం భారతీయ కరెన్సీ నోట్లపై భారత దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. దీనిని ఎవరూ కాదనడం లేదు.
ఇప్పటికే నోట్ల రద్దుతో భారతీయ ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసిన మోదీ రాబోయే రోజుల్లో మరింత దిగజార్చే చర్యలు చేపడుతున్నారంటూ మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ప్రధానమంత్రికి ఓ సూచన చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని దీని నుంచి గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం ఉందని పేర్కొన్నారు. అదేమిటంటే ఏదైనా ధనం రావాలంటే , కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటే బీజేపీ చెప్పేది ఒక్కటే పూజించండి అని.
ఇక భారత ప్రభుత్వం (ఆర్బీఐ) ఏటా ముద్రించే రూపాయలపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మిదేవి, వినాయకుడి ఫోటోలను కూడా ముద్రించాలని సూచించారు. దీని వల్ల మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు కేజ్రీవాల్(Arvind Kejriwal) . ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ బీజేపీలో కలకలం రేపాయి. సీఎం చేసిన కామెంట్స్ ఇంకా స్పందించ లేదు బీజేపీ.
Also Read : హిజాబ్ మహిళ ఎంఐఎం చీఫ్ అవుతుందా