TRS MLAs Security : ఆ నలుగురికి ఫుల్ సెక్యూరిటీ
జారీ చేసిన తెలంంగాణ సర్కార్
TRS MLAs Security : దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితులు రామ చంద్ర భారతి, నందు, స్వామీజీ సుప్రీంకోర్టులో తమకు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భిన్న స్వరం వినిపించడంపై సీరియస్ అయ్యింది. ఇదే క్రమంలో కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్ష వర్దన్ రెడ్డి, రేగా కాంతారావు, పటేల్ రోహిత్ రెడ్డిలకు అదనపు భద్రతను పెంచింది ప్రభుత్వం(TRS MLAs Security) .
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర హొం శాఖ ఆదేశాలు జారీ చేయడం విశేషం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. దీనిని సీఎం కేసీఆర్ బట్ట బయలు చేశారు. తానే ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ పేర్కొన్నారు.
ఇక వారికి ముప్పు ఉందని భావిస్తూ కేబినెట్ మంత్రి స్థాయి సెక్యూరిటీని కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది హోం శాఖ. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు 4+4 భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. వీరికి సంబంధించి హైదరాబాద్ లోని ఇంటి వద్ద, సొంత నియోజకవర్గంలోనూ సెక్యూరిటీ ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇవ్వడం కలకలం రేపింది.
Also Read : మునుగోడు కౌంటింగ్ ఏర్పాట్లపై ఫోకస్