Aditi Gupta Menstrupedia : మ‌హిళ‌ల పాలిట దేవత అదితి గుప్తా

మెన్స‌స్ నుంచి మెన్‌స్ట్రుపీడియా ర‌క్ష‌ణ

Aditi Gupta Menstrupedia : ఎవ‌రీ అదితి గుప్తా అనుకుంటున్నారా. ఆమె ఎంద‌రో మ‌హిళ‌ల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. నెల నెలా వ‌చ్చే రుతుచ‌క్రం గురించి ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు స్వంతంగా మెన్‌స్ట్రుపీడియాను స్థాపించారు. మెన్స‌స్ స‌మ‌యంలో వంట గ‌దిలోకి, ప్రార్థ‌నా స్థ‌లంలోకి వెళ్ల కూడ‌ద‌నే అభిప్రాయాన్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. 

దేశంలోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని మ‌హిళ‌ల‌కు మేలు చేకూర్చేలా దీనిని ఏర్పాటు చేశారు అదితి గుప్తా(Aditi Gupta Menstrupedia).

ఆమె రుతుక్ర‌మం గురించి చైత‌న్యాన్ని వ్యాప్తి చేసే దిశ‌లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తోంది. ప్ర‌ధానంగా రుతుక్ర‌మం గురించిన అవ‌గాహ‌న లేక పోవ‌డం , స్త్రీలు, బాలిక‌లు జీవ‌నాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తుంద‌నే దాని గురించి విస్తృత ప‌రిశోధ‌న‌లు చేసింది. అదితి గుప్తా ఫోర్డ్ ఫౌండేష‌న్ రీసెర్చ్ స్కాల‌ర్ గా విస్తృత అధ్య‌యనాన్ని నిర్వ‌హించింది.

ఆమెకు 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు రుతుక్ర‌మం స్టార్ట్ అయ్యింది. ఆనాటి నుంచి ఎందుకు దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం ఉండ‌ద‌నే దిశ‌గా ఆలోచించింది. 15వ ఏట‌నే దాని ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకుంది. 

ఇంట్లో ప్ర‌త్యేక ప్ర‌దేశంలో ప‌డుకోవాలి. బ‌ట్ట‌లు విడిగా ఉత‌కాలి. దేవుడిని ప్రార్థించే స్థ‌లాన్ని తాకేందుకు అనుమ‌తి లేదు. ఇదంతా ఎందుక‌ని ఆలోచించింది అదితి గుప్తా

ప్ర‌తి యువ‌తి, స్త్రీలు కొంత స‌మ‌యంలో ప్ర‌భావితం చేసే ఈ కీల‌క అంశం గురించి స్పృహ లేక పోవ‌డం , చ‌ర్చ‌కు కూడా అనుమ‌తించ‌క పోవ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఇదే ఆమెను మెన్‌స్ట్రుపీడియా ను ఏర్పాటు చేసేలా దారి తీసింది. 

అదితి గుప్తా(Aditi Gupta) గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో ఎన్ఐడీలో చ‌దువుకుంది. ఆమె అనేక ప్రాజెక్టుల‌లో ప‌ని చేసింది. త‌న భ‌ర్త తుహిన్ ప‌టేల్ తో క‌లిసి హిందీ కామిక్ పుస్త‌కాన్ని రూపొందించారు.

ఇది కామిక్ పుస్త‌కం. వెబ్ సైట్ లో పారిశుధ్యం , పీరియ‌డ్స్ త‌దిత‌ర వాటి గురించి వివ‌రాలు ఉంటాయి. లైంగిక విజ్ఞానం క‌లిగించేలా చేసింది.

6,000 పాఠ‌శాల‌లు, ప్రోత్సామ‌న్ , మున్షీ జ‌గ‌న్నాథ్ భ‌గ‌వాన్ స్మృతీ ఫౌండేష‌న్ , ఇన్ స్టింక్స్ , క‌న్హా వంటి 12 స్వ‌చ్చంధ సంస్థ‌లు, ల‌డ‌ఖ్ లోని రెండు బౌద్ద మ‌ఠాలు , 2,50,000 యువ‌కుల మ‌ధ్య 70కి పైగా పాఠ‌శాల అధ్య‌య‌న కార్య‌క్ర‌మంలో చేర్చారు. 

18 విభిన్న దేశాల‌లో స‌మాచారాన్ని పంపిణీ చేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగింది. 11కి పైగా భాష‌ల్లో అనుసంధానం చేశారు. శ్ర‌ద్ధా క‌పూర్ , ప‌రిణీతి చోప్రా, క‌ల్కీ కోచ్లిన్ , నేహా ధూపియా, మందిరా బేడి వంటి అనేక మంది న‌టీమ‌ణులు దీనికి ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నారు.

Also Read : కాస్మెటిక్ సెక్టార్ లో ‘డాలీ’ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!