Aditya Thackeray : రాజ్ థాక‌రే పై ఆదిత్య థాక‌రే క‌న్నెర్ర‌

ద్ర‌వ్యోల్బ‌ణం గురించి మాట్లాడండి

Aditya Thackeray : వ‌చ్చే మే 3 లోపు మ‌సీదుల వెలుపల లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించ‌కుంటే నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌డ్తామంటూ బెదిరింపుల‌కు గురి చేసిన మ‌హ‌రాష్ట్ర న‌వ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్ ) చీఫ్ రాజ్ థాక‌రే పై మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే (Aditya Thackeray)నిప్పులు చెరిగారు.

మీరు చెప్పిన‌ట్లే చేద్దాం. ముందు లౌడ్ స్పీక‌ర్లు తీసేసే బ‌దులు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం గురించి మాట్లాడితే స‌రి పోతుంద‌ని ఎద్దేవా చేశారు ఆదిత్యా ఠాక్రే. పెట్రోల్ , డీజిల్ , సీఎన్జీ ధ‌ర‌ల గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

గ‌తంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడే మీరే ఓట్ల కోసం లౌడ్ స్పీక‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదా అంటూ నిల‌దీశారు ఆదిత్యా థాక‌రే. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గ‌త కొన్ని రోజులుగా లౌడ్ స్పీక‌ర్ల‌పై రాజ్ థాక‌రే చేసిన కామెంట్స్ తో రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. మే 3 వ‌ర‌కు డెడ్ లైన్ విధిస్తున్నామ‌ని ఆలోగా మ‌సీదుల నుంచి లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని లేక పోతే మ‌హా నిర్మాణ్ సేన కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగుతారంటూ రాజ్ థాక‌రే హెచ్చ‌రించారు.

అంతే కాదు మసీదుల వెలుప‌ల స్పీక‌ర్ల‌ను అమ‌ర్చుతామ‌ని, అందులో హ‌నుమాన్ చాలీసా వినిపిస్తామంటూ మ‌హా వికాస్ అఘాడీకి డెడ్ లైన్ విధించారు.

ఠాక్రే ఈ స‌మ‌స్య‌ను సామాజిక స‌మ‌స్య‌ను పేర్కొన్నారు. తాను ఈ అంశంపై వెన‌క్కి త‌గ్గ‌బోన‌ని, ఏం చేయాల‌ని అనుకుంటే అది చేయండి అని స‌వాల్ చేశారు.

ప్ర‌స్తుతం ఆదిత్య రాజ్ ఠాక్రేల(Aditya Thackeray) మ‌ధ్య మాట‌ల యుద్దం పెరిగింది.

Also Read : రాముడు దేవుడంటే ఒప్పుకోం – మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!