Rahul Gandhi : ఆదివాసీలు దేశానికి యజమానులు – రాహుల్
మహూవాలో జరిగిన పాదయాత్రలో కామెంట్స్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివాసీలను ఆకాశానికి ఎత్తేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం సూరత్ జిల్లాలోని మహూవాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశానికి మొదటి యజమానులు గిరిజనులు, ఆదివాసీలని పేర్కొన్నారు.
గిరిజన సమాజం దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ జోడో యాత్ర సందర్బంగా తాను ప్రజలు , రైతులు, యువతీ యువకులు, గిరిజనులు, వృద్దులు ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసు కోగలిగానని చెప్పారు.
గుజరాత్ ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో గిరిజనులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలు మూలవాసులని వారి హక్కులను హరించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోందంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. కాషాయ శ్రేణులు మిమ్మల్ని వనవాసీలు అని పిలుస్తారు.
కానీ మీరు ఈ దేశానికి మొదటి యజమానులు అని పిలిచేందుకు ఒప్పుకోరని మండిపడ్డారు. మీరంతా అడవుల్లో నివసిస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మీరంతా చదువు కోవాలని విమానాలు నడిపే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు.
గత 10 ఏళ్లలో అరణ్యాలన్నీ మన చేతుల్లోకి వస్తాయన్నారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లో దేశం బందీ అయి పోయిందన్నారు. ఆదివాసీలు దేశంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.
Also Read : మోర్బీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్