Opposition Meet : ప్ర‌తిప‌క్షాల స‌మావేశం వాయిదా

కాంగ్రెస్, డీఎంకే అభ్య‌ర్థ‌న

Opposition Meet : బీహార్ లోని పాట్నాలో జూన్ 12న జ‌ర‌గాల్సిన ప్ర‌తిప‌క్షాల కీల‌క స‌మావేశం(Opposition Meet) వాయిదా ప‌డింది. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థన మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే అంద‌రికీ స‌మాచారం అందింది. ఇదిలా ఉండ‌గా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ కీల‌క భేటీని వాయిదా వేశారు. ఈ మేర‌కు జూన్ 23న తిరిగి నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీల‌క‌మైన నాయ‌కుడు, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఆయ‌న తిరిగి భార‌త దేశానికి జూన్ 15న రానున్నారు. ఆయ‌న లేకుండా స‌మావేశం జ‌ర‌గ‌డం భావ్యం కాద‌ని ఏఐసీసీ భావించింది. ఈ మేర‌కు ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క స‌మావేశానికి ఆతిథ్యంతో పాటు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు విన్న‌వించారు.

దీంతో వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. మ‌రో వైపు వైద్య కార‌ణాల రీత్యీ సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, కూతురు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ కూడా విదేశాల్లోనే ఉన్నారు. మ‌రో వైపు డీఎంకే కూడా వాయిదా వేయాల‌ని కోరింది. సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. అందుకుని రాలేక పోతున్న‌ట్లు తెలిపింది .

Also Read : AI Generated : ఏఐ చిత్రాలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!