Joe Biden : ఉక్రెయిన్ కు అధునాతన రాకెట్లు – బైడెన్
ప్రకటించిన అమెరికా దేశాధ్యక్షుడు
Joe Biden : ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ఆపడం లేదు. మరో వైపు అమెరికా ఉక్రెయిన్ కోసం ఏమైనా చేసేందుకు సిద్దమని ప్రకటించింది. ఈ తరుణంలో అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) సంచలన ప్రకటన చేశారు.
ఉక్రెయిన్ తనను తాను రక్షించు కునేందుకు గాను లాంగ్ రేంజ్ అడ్వాన్స్ డ్ రాకెట్ సిస్టమ్ లను పంపుతున్నట్లు వెల్లడించారు. వీటిని ఉక్రెయిన్లు ఉపయోగించు కుంటారని తెలిపారు.
కానీ వాటిని రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించరని స్పష్టం చేశారు బైడెన్. రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ కు అమెరికా నూతన ఆయుధాలను సిద్దం చేస్తోందని ఇప్పటికే వైట్ హౌస్ తెలిపింది.
ఇందులో భాగంగానే లాంగ్ రేంజ్ లో ఉపయోగించే ముందస్తు రాకెట్ సిస్టమ్ లను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్(Joe Biden).
700 మిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీలో భాగంగా సుదూర రష్యా లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడి చేయగల అధునాతన రాకెట్ వ్యవస్థలను ఉక్రెయిన్ కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంగీకారం తెలిపారు.
80 కిలోమీటర్లు (50 మైళ్లు ) దూరంలో ఉన్న లక్ష్యాలను కచ్చితంగా చేధించగల హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ లను యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ కు అందజేస్తోందని అమెరికన్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
గణనీయంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అందిస్తుంది. ఇదిలా ఉండగా ఈ అధునాతన రాకెట్లు, మందు గుండు సామాగ్రి రష్యాపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు తాము సహాయం చేయడం లేదని, కేవలం రక్షణాత్మకంగా ఉండేందుకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు జోసెఫ్ బైడెన్.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలి