Afghan Earthquake : ఆఫ్గాన్ లో భూకంపం 280 మంది దుర్మరణం
ఆసరా..సాయం కోసం ఆఫ్గన్ల ఎదురు చూపు
Afghan Earthquake : ప్రకృతి ఎంత బలీయమైనదో ఇప్పుడు తెలిసొచ్చింది ఆఫ్గనిస్తాన్ కు. కేవలం తుపాకులనే నమ్ముకుని విధ్వంసాలకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు అనుకోకుండా వచ్చిన భూకంపం బెంబేలెత్తించింది.
భూ కంపం దెబ్బకు ఏకంగా ఆఫ్గనిస్తాన్(Afghan Earthquake) లో కడపటి వార్తలు అందేసరికి 280 మంది మరణించారు. ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నారు. రిక్టార్ స్కేల్ పై 6.1 గా భూకంపం తీవ్రత నమోదైంది.
ఎక్కువ మరణాలు తూర్పు ప్రావిన్స్ పక్తీకాలో చోటు చేసుకున్నాయి. ఇక్కడే 255 మంది మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న భూ కంపానికి 280 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతదేహాలు దుప్పట్లతో కప్పి ఉంచారు. పరిస్థితి దారుణంగా ఉంది. చూసేందుకు సైతం భయం గొల్పేలా ఉంది. ఈ భూకంపం ఆఫ్గనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మారుమూల పర్వత గ్రామాలలో ఇంకా ఎంత మంది బతికి బయట పడ్డారనేది తెలియదన్నారు.
పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీసీ ) తెలిపింది.
ఇక ఆఫ్గనిస్తాన్(Afghan Earthquake) రాజధాని కాబూల్ లో భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
పెద్ద సంఖ్యలో గాయపడ్డారని వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు ఆఫ్గనిస్తాన్ మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్ అయుబి. ఖోస్ట్ ప్రావిన్స్ లో 25 మంది మరణించారని, 90 మందిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Also Read : వాషింగ్టన్ డీసీలో కాల్పుల మోత