Jagdeep Dhankar : నామినేషన్ దాఖలు చేసిన జగ దీప్
హాజరైన ప్రధాని , రాజ్ నాథ్ , అమిత్ షా
Jagdeep Dhankar : భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ ఖర్(Jagdeep Dhankar) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో సుదీర్గ కాలం పాటు బీజేపీతో టచ్ లో ఉంటూ వచ్చారు జగదీప్ ధన్ ఖర్. అనంతరం బీజేపీ పవర్ లోకి రావడంతో జగదీప్ పంట పండింది.
ఆయనకు ఊహించని రీతిలో ప్రమోషన్ దక్కింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అవకాశం ఇచ్చారు ప్రధాన మంత్రి. ఇక్కడే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు జగదీప్ ధన్ ఖర్.
ఆయన రాష్ట్రంలో గవర్నర్ గా ఏ మాత్రం వ్యవహరించ లేదు. అంతా తానే సర్వస్వం అయినట్లు వ్యవహరించారు. ఆపై గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. సీఎం మమతా బెనర్జీతో చివరి వరకు పోట్లాడారు.
ఇద్దరికీ మాటలు లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడమే కాకుండా ఏకంగా బీజేపీకి లాయల్ గా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
దీంతో ఈ గవర్నర్ తమకు వద్దంటూ ఏకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసింది. ఈ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపించింది.
ఈ తరుణంలో ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న వెంకయ్య నాయుడుకు ప్రమోషన్ లభిస్తుందని భావించారు. కానీ మోదీ ఆయనకు షాక్ ఇస్తూ ధన్ కర్ కు అవకాశం ఇచ్చారు.
Also Read : గవర్నమెంట్ ఉద్యోగులు రెండో పెళ్ళికి అనుమతి తప్పనిసరి