Agnipath Scheme Protest : అగ్నిప‌థ్ పై అట్టుడుకుతున్న దేశం

బీహార్, యూపీ, తెలంగాణ‌ల‌లో ఉద్రిక్తం

Agnipath Scheme Protest : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ఆర్మీకి చెందిన అగ్ని ప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీం(Agnipath Scheme Protest) పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. బీహార్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, త‌దిత‌ర రాష్ట్రాల‌లో నిరుద్యోగులు భ‌గ్గుమ‌న్నారు.

ఇప్ప‌టికే ప‌లు రైళ్ల‌ను త‌గుల బెట్టారు. బ‌స్సుల‌ను ధ్వంసం చేశారు. నిన్న బీహార్ లో విధ్వంసం చెల‌రేగితే సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పింప చేస్తోంది. రాళ్లు రువ్వుతున్నారు ఆందోళ‌న‌కారులు. పోలీసులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

ఒక‌రు మృతి చెందారు. టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌యాణీకులు భ‌యంతో ప‌రుగులు తీశారు. రైల్వే స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ అదుపులోకి తీసుకున్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధీనంలోని హ‌ర్యానా, మ‌ధ్య ప్ర‌దేశ్ ల‌కు కూడా వ్యాపించింది. దేశంలోని రైల్వే స్టేష‌ల‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు.

నాలుగు రైళ్ల‌ను త‌గుల బెట్టారు. మొహియుద్దీన్ న‌గ‌ర్ స్టేష‌న్ జ‌మ్మూ తావ ఎక్స్ ప్రెస్ రైలు బోగీల‌కు నిప్పు పెట్టారు. అగ్ని ప‌థ్ స్కీంపై నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మూడో రోజుకు చేరుకున్నాయి.

శుక్ర‌వారం ఉత్త‌ర ప్ర‌దేశ్ , బీహార్ , తెలంగాణ‌లో ప‌లు రైళ్ల‌కు నిప్పంటించారు. మొత్తం రైళ్ల‌ను నిలిపి వేశారు. బీహార్ లోని బెట్టియాలో డిప్యూటీ సీఎం రేణు దేవి ఇంటిపై దాడికి దిగారు ఆందోళ‌న‌కారులు. అధికార పార్టీకీ చెందిన బీజేపీ ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేశారు.

బెగుస‌రాయ్ జిల్లాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. రాళ్ల వ‌ర్షం కురిపించారు. ల‌ఖిస‌రాయ్ లో బీజేపీ ఆఫీస్ పై దాడికి దిగారు. అగ్నిప‌థ్ పై ప్ర‌తిప‌క్షాలు మండి ప‌డుతున్నాయి.

Also Read : అగ్నిప‌థ్ ఆగ్ర‌హం సికింద్రాబాద్ ర‌ణ‌రంగం

Leave A Reply

Your Email Id will not be published!