Secunderabad Fire : అగ్నిపథ్ ఆగ్రహం సికింద్రాబాద్ రణరంగం
కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న వైనం
Secunderabad Fire : అగ్నిపథ్ స్కీం రాజేసిన నిరసన దేశాన్ని తాకింది. ఎక్కడ చూసినా నిరసనలు మిన్నంటాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఆ సెగ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Fire) పూర్తిగా ధ్వంసమైంది.
విధ్వంసకర వాతావరణం చోటు చేసుకుంది. పలు రైళ్లను తగుల బెట్టారు. బోగీలు ఇంకా తగులబడి పోతున్నాయి. రాళ్లు రువ్వుతున్నారు. వారిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు తంటాలు పడుతున్నారు.
మరో వైపు రైల్వే స్టేషన్ బయట బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అన్ని రైళ్లను నిలిపి వేశారు. రాళ్ల దాడి మొదలు కావడంతో భయంతో ప్రయాణీకులు పరుగులు తీశారు.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం హకీంపేట్ కు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు. రైల్వే స్టేషన్(Secunderabad Fire) మొత్తం రాళ్లతో నిండి పోయింది.
నాలుగు ఏళ్ల పాటు మాత్రమే సాయుధ దళాలకు ఎంపిక చేస్తామని చెప్పిన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయడం లేదు.
సాయుధ దళాలకు ఎంపిక కావుదామని వచ్చిన తమ ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆరోపించారు. కరోనా అన్నది ఆర్మీకే వచ్చిందా ఎన్నికలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైల్వే పోలీసులతో పాటు ఆర్మీ, తెలంగాణ పోలీసులు జత కూడారు. భారీ గుంపును కంట్రోల్ చేసేందుకు కాల్పులకు తెగబడ్డారు. ఒకరు చని పోయినట్లు సమాచారం.
Also Read : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తం