Agnipath Protest : మేం ఎంతో కష్టపడ్డాం. కానీ ఇప్పుడు అప్పుడు అంటూ నాన్చుతూ వస్తున్నారు. మీకేమో పదవులు మాకేమో పస్తులు. మేం మా న్యాయపరమైన డిమాండ్ అడుగుతున్నాం.
మాకు ఉద్యోగాలు కావాలని అడగడం తప్పు ఎలా అవుతుంది. అసలు మమల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు నిగ్గదీసి(Agnipath Protest) అడుగుతున్నారు.
రాజకీయ నాయకులు ఏం సాధించారని , ఏం వెలగబెట్టారని వాళ్లకు అన్నన్ని జీతాలు. వాళ్లకు సెక్యూరిటీలు, సౌకర్యాలు. వీళ్ల వళ్ల దేశం, రాష్ట్రం నాశనం అవుతుందే తప్ప ఎలాంటి లాభం లేదు.
మళ్లీ వీళ్లకు పెన్షన్లు ఎందుకు. మీరు మీ పెన్షన్లను రద్దు చేసుకోండి. దేశానికి అదనపు భారం కొంచెమైనా తగ్గుతుంది కదా అని ప్రశ్నించారు. రాజకీయాలు మానేసి మా కోసం ఆలోచించండి అంటూ పాలకులకు సూచించారు నిరుద్యోగులు.
సాయుధ బలగాలను కూడా కాంట్రాక్టు వ్యవస్థ లోకి తీసుకు వస్తే ఇక దేశం ఏమై పోతుందో అర్థం చేసుకోవాలని వారంటున్నారు. కాల్పులు జరపాలంటే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలి.
అలాంటిది ఏమీ లేకుండా ఎలా కాల్పులకు పాల్పడతారంటూ నిలదీశారు. ముందు తమపై దాడి(Agnipath Protest) చేసేందుకు వచ్చారని తాము రక్షించుకునేందుకు రాళ్లు రువ్వామని ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
పోయిన ప్రాణం ఎవరు తీసుకు వస్తారని , మోదీ ఇస్తారా అని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడమే లేదు. పోనీ కేంద్రం నుంచైనా జాబ్స్ తెచ్చుకుందామంటే ఇలాంటి పరిస్థితి దాపురించిందంటున్నారు.
అన్ని పరీక్షలు నెగ్గి రెండేళ్ల దాకా ఎందుకు ఆగాలని మండిపడ్డారు.
Also Read : మోదీ ఇకనైనా కళ్లు తెరవండి – కేటీఆర్