KCR : వ్యవసాయం జీవన యానం – కేసీఆర్
అది దండుగ కాదు పండుగ
KCR : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఒకప్పుడు తెలంగాణ నానా యాతన పడ్డది. కానీ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టాలు. వాటినన్నింటిని తట్టుకుని నిలబడేలా చేశామన్నారు సీఎం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దిక్కులేనిదిగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా కుదలైంది. సాగు నీరు లేదు. తాగు నీటికి కటకట. ఎక్కడ చూసినా బతుకు గోస. నేను పర్యటించిన ప్రాంతాలన్నీ కరవుతో నెర్రలు బారినవి. వాటిని చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు కేసీఆర్.
చేసిన అప్పులు తీర్చలేక , బ్యాంకులకు వడ్డీలు , అసలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆకలి చావుల గురించి చెప్పాల్సిన పనేలేదు.
కానీ కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆనాటి కష్టాలు లేవు. ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. ఇప్పుడు కన్నీళ్లు లేవు అంతా పన్నీరే ఉందన్నారు సీఎం కేసీఆర్. కుదేలైన వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించేలా చేశామని చెప్పారు.
ఉద్యమ సమయంలో పర్యటించిన తనకు రైతుల బాధలు ఏమిటో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో స్వయంగా తెలిసందన్నారు సీఎం(KCR).
స్వరాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయ రంగం ధాన్యాగారంగా మారిందన్నారు కేసీఆర్(KCR). కృష్ణా, గోదావరి నదుల నీటిని సద్వినియోగం చేసుకునేలా చేశానని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు విస్తు పోయేలా చేసిందన్నారు.
Also Read : కిన్నెర మొగులయ్యకు లైన్ క్లియర్