AH Vishwanath : దేశ వ్యాప్తంగా విజయోత్సవ సంబురాలలో మునిగి తేలుతున్న కాషాయ పరివారానికి కోలుకోలేని షాక్ తగిలింది. కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ తరుణంలో మత రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హెచ్. విశ్వనాథ్(AH Vishwanath )సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ప్రధానంగా కర్ణాటక సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలను ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా చూస్తోందంటూ ఆరోపించారు.
దీంతో ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి కాషాయ దళంలో. ఇదిలా ఉండగా 2019లో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమిని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు హెచ్ . విశ్వనాథ్.
హిజాబ్ వివాదం తర్వాత దేవాలయ ప్రాంగణాలలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ రైట్ వింగ్ సంస్థలు పిలుపు ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు.
కర్ణాటక శాసన మండలి సబ్యుడు అయిన విశ్వ నాథ్ మత రాజకీయాలకు సర్కార్ పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర దేశాలలో ముస్లింలు నివసిస్తున్నారు.
ఆహారం, పూలు అమ్మతున్నారు. మనం అవసరం ఉండి అక్కడికి వెళితే తీసుకోకుండా ఉంటామా అని ప్రశ్నించారు. వారంతా చిరు వ్యాపారులు. అక్కడ హిందూ ముస్లిం అన్న పట్టింపు ఉండదన్నారు.
ఇది ఖాళీ కడుపులకు సంబంధించిన ప్రశ్న అని నిలదీశారు. ఈ విషయాన్ని తాను సీఎంకు చెప్పానన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం కానీ భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ , లేదా కొన్ని వర్గాలు కాదన్నారు.
Also Read : బెంగాల్ అసెంబ్లీలో కిష్కింధకాండ