Gidugu Rudraraju : ఏపీపీసీసీ చీఫ్ గా గిడుగు రుద్ర‌రాజు

శైల‌జానాథ్ ను త‌ప్పించిన ఏఐసీసీ

Gidugu Rudraraju : ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గా ఉన్న సాకె శైల‌జానాథ్ ను త‌ప్పించింది. ఆయ‌న గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా ఉండ‌డంతో తుల‌సీరెడ్డి స్థానంలో పీసీసీ అధ్య‌క్షుడిగా అప్ప‌ట్లో నియ‌మించింది.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని త‌ట్టుకునే రీతిలో పార్టీని న‌డిపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇటీవ‌ల ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో సైతం శైల‌జానాథ్ పాల్గొన్నారు. కానీ ఊహించ‌ని రీతిలో శైల‌జానాథ్ కు చెక్ పెట్టింది హైక‌మాండ్. ప్ర‌స్తుతం కొత్త అధ్యక్షుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కొలువు తీరారు.

ఇక శైలజా నాథ్ స్థానంలో గిడుగు రుద్రరాజును(Gidugu Rudraraju)  ఏపీపీసీసీ చీఫ్ గా నియ‌మించింది. ఈ మేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తిగా పార్టీకి సంబంధించి ఏపీలో కీల‌క మార్పులు చేసింది. రుద్ర‌రాజుతో పాటు పీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులుగా జంగా గౌత‌మ్ , రాకేశ్ రెడ్డి, మ‌స్తాన్ వ‌లీ, సుంక‌రి ప‌ద్మ‌శ్రీ‌ని నియ‌మించింది ఏఐసీసీ.

అంతే కాకుండా ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్ గా ప‌ళ్లంరాఉ, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా జి. హ‌ర్ష కుమార్ , మీడియా, సామాజిక మాధ్య‌మాల క‌మిటీ చైర్మ‌న్ గా ఎన్. తుల‌సీరెడ్డిని నియ‌మించింది ఏఐసీసీ. ఈ విష‌యాన్ని కేసీ వేణుగోపాల్ వెల్ల‌డించారు. అధికారికంగా ప్ర‌క‌టించారు. పార్టీ హైక‌మాండ్ తీసుకున్న నిర్ణ‌యంతో షాక్ కు గుర‌య్యారు శైల‌జానాథ్.

Also Read : కేంద్రానికి షాక్ సీఈసీ ఎంపిక‌పై సుప్రీం గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!