Digvijay Singh : కాంగ్రెస్ కు డిగ్గీ రాజా చికిత్స
అంతర్గత సంక్షోభంపై ఆరా
Digvijay Singh : కాంగ్రెస పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి తెర దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరే కుంపటి పెట్టడం కలకలం రేపింది. ఆపై తీవ్ర విమర్శలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ధిక్కార స్వరం వినిపించిన నాయకులలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ , సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నర్సింహ్మ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. వీరికి మద్దతుగా వి. హనుమంతురావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయటి నుంచి ప్రశ్నిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి అయితే బాహాటంగానే విమర్శలు గుప్పించడం మరింత వేడిని రాజేసింది.
ఈ తరుణంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను పరిష్కరించే బాధ్యతను డిగ్గీ రాజాకు అప్పగించింది. దీంతో ఆయన గాడిన పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఒక్కొక్కరితో పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. జీ9 నేతలతో దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) భేటీ ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికే జీవన్ రెడ్డి, వీహెచ్, రేణుకా చౌదరితో సమావేశం అయ్యారు.
ఇక జానా రెడ్డి అయితే హోటల్ లో కలుసుకున్నారు. చెప్పాల్సిందంతా చెప్పానన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మల్లు రవి.
Also Read : నా వల్లే హైదరాబాద్ కు పేరొచ్చింది