Sunil Jakhar : సునీల్ జాఖ‌ర్ కు షోకాజ్ నోటీస్

సంజాయిషీ కోరిన ఏఐసీసీ

Sunil Jakhar : పంజాబ్ మాజీ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా పార్టీ కార్య‌క‌లాపాల‌పై నోరు పారేసుకున్న ఆ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు సునీల్ జాఖ‌ర్ కు ఏఐసీసీ నోటీసు జారీ చేసింది.

ఈ మేర‌కు ఎందుకు అలా మాట్లాడాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ సంజాయిషీ ఇవ్వాల‌ని కోరింది. ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కంటే ముందే సునీల్ జాఖ‌ర్(Sunil Jakhar) పార్టీ నాయ‌క‌త్వంపై, అనుస‌రిస్తున్న తీరుపై మాజీఈ సీఎం చ‌న్నీతో పాటు మాజీ పీసీసీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ ల‌పై నిప్పులు చెరిగారు.

వీరిద్ద‌రి నిర్వాకం వ‌ల్ల‌నే పార్టీ నాశ‌న‌మైంద‌ని ఆరోపించారు. అంతే కాదు వారిని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. వీరికి ప‌ద‌వులు అప్ప‌గించిన హై క‌మాండ్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు సునీల్ జాఖ‌ర్(Sunil Jakhar).

దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఏఐసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఏడు రోజుల లోగా సునీల్ జాఖ‌ర్ స‌మాధానం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

ద‌ళిత కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లను నిర‌సిస్తూ సునీల్ జాఖ‌ర్ దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర‌మైన భాష వాడారంటూ ఆరోపించారు.

తాను అలా అన‌లేదంటూ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు సునీల్ జాఖ‌ర్. రాష్ట్రానికి చెందిన ఓ నాయ‌కుడు పార్టీకి ఫిర్యాదు చేశారు. అంద‌రినీ ఎక్క‌డ ఉంచాలో నాయ‌క‌త్వం తెలుసు కోవాలంటూ సూచించారు.

తాను అలా అన‌లేద‌ని చెబుతున్నా వీడియో క్లిప్పులు ఇప్పుడు పార్టీ చేతిలో ఉండ‌డంతో నోటీసుకు ఆన్స‌ర్ ఇవ్వాల్సి ఉంది.

Also Read : నీతి ఆయోగ్ లిస్టులో గుజ‌రాత్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!