Air Bus Shamshabad : శంషాబాద్ లో ‘ఎయిర్ బస్’ బెలూగా
కార్గో సర్వీస్ లో కీలకం
Air Bus Shamshabad : బెలూగా ఎయిర్ బస్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొలువు తీరింది. ప్రస్తుతం దీనిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తిమిలింగం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్ బస్ గా పేరు పొందింది. ఇది మంగళవారం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది.
Air Bus Shamshabad Airport
ఇదిలా ఉండగా భారీ విమానం కోసం ల్యాండింగ్ , పార్కింగ్, టేకాఫ్ కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా ఎయిర్ పోర్టులో వేల్ ఆఫ్ ది స్కై నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే కేవలం ఇంధనం నింపు కోవడం కోసం ఎయిర్ పోర్టులో నిలిచింది.
ఈ ఎయిర్ బస్ బెలూగా(Air Bus Beluga) భారీ ఎయిర్ కోర్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ది చెందింది. వరల్డ్ లోనే బిగ్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఆంటోనోవ్ ఏఎన్ 225 , మే 2016లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దేశంలో తొలిసారిగా ల్యాండింగ్ అయ్యింది.
మొత్తంగా కార్గో ఎయిర్ బస్ బెలూగా ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణీకులు దీనిని వింతగా చూడడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Minister Niranjan Reddy : రూ. 403 కోట్లతో కోహెడ మార్కెట్