Air India Fined : ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా
టికెట్ ఉన్న బోర్డింగ్ నిరాకరణపై డీజీసీఏ చర్య
Air India Fined : ఎయిర్ ఇండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది డీజీసీఏ. చెల్లుబాటు అయ్యే టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణికులకు బోర్డింగ్ ఇచ్చేందుకు నిరాకరించినందుకు గాను ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా(Air India Fined) విధించింది.
ఇందులో భాగంగా అన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే వ్యవస్థలను అప్రమత్తం చేయాలని సూచించింది డీజీసీఏ.
ఒకవేళ రూ. 10 లక్షలు జరిమానా కట్టడంలో విఫలం అయినట్లయితే తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
చెల్లుబాటు అయ్యే టిక్కెట్ లను కలిగి ఉన్న ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించడం నేరం. ఇది పూర్తిగా విమానయాన సంస్థ నియమ నిబంధనలకు విరుద్దం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది డీజీసీఏ.
ఒకవేళ నిరాకరించినా ఎందుకు నిరాకరించారో చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు వారికి తిరిగి టికెట్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ ఎయిర్ ఇండియా పట్టించు కోలేదంటూ మండి పడింది డీజీసీఏ.
వరుస తనిఖీలు చేపట్టాం. ఇందులో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో నిఘా సమయంలో , ఎయిర్ ఇండియా విషయంలో ప్రయాణికుల పరిహారం గురించి అనుసరించని సందర్భాలు చాలా ఉన్నాయని తేలిందని డీజీసీఏ స్పష్టం చేసింది.
దీంతో ఎయిర్ ఇండియాకు(Air India Fined) షోకాజ్ నోటీసులు ఇచ్చామని స్పష్టం చేసింది. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని సూచించింది. ఒక వేళ చర్యలు తీసుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది డీజీసీఏ.
Also Read : పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్