PM Modi Airports : విమానాశ్ర‌యాలు ప్ర‌గ‌తికి దారులు – మోదీ

మెరుగైన క‌నెక్టివిటీతో మ‌రింత అభివృద్ది

PM Modi Airports : దేశంలో కొత్త‌గా ఏర్పాటువుతున్న విమానాశ్ర‌యాల ఏర్పాటు వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా చేస్తుంద‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Airports). ఫిబ్ర‌వ‌రి 19న దేశీయ విమానాల రాక పోక‌లు క‌రోనా మ‌హ‌మ్మారి అనంత‌రం గ‌రిష్ట స్థాయి 4.45 ల‌క్ష‌ల‌ను తాక‌డం గురించి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు బుధ‌వారం. దీనికి సంబంధించిన ట్వీట్ ను ప్ర‌ధాన‌మంత్రి పంచుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 147 ఆప‌రేష‌న‌ల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయ‌ని తెలిపారు మోదీ.

త‌మ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎయిర్ పోర్టుల నిర్మాణం చేప‌డుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు తాము ఫోక‌స్ పెడుతున్నామ‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. రాబోయే రోజుల్లో కొత్త‌వి కూడా ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ. మ‌రిన్ని ఎయిర్ పోర్టులు , మెరుగైన క‌నెక్టివిటీ వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను ద‌గ్గ‌ర చేస్తుంద‌ని , ఇది జాతీయ పురోగ‌తిని పెంచుతుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.

కోవిడ్ కు ముందు రోజూ వారీ దేశీయ విమాన ప్ర‌యాణీకుల సగ‌టు సంఖ్య 3,98,579 ఉండేద‌ని, కానీ కోవిడ్ త‌ర్వాత అది కాస్తా 4,44,845 మందికి చేరుకుంద‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. ఇదిలా ఉండ‌గా కేంద్ర విమాన‌యాన శాఖ మ‌త్రి జ్యోతిరాదిత్యా సింధియా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఫిబ్ర‌వ‌రి 27న క‌ర్ణాట‌క లోని శివ‌మొగ్గ‌లో కొత్త‌గా నిర్మించిన ఎయిర్ పోర్ట్ ను ప్ర‌ధాన మంత్రి మోదీ(PM Modi Airports) ప్రారంభిస్తార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపింది దేశీయ విమానయాన రంగంపై.

Also Read : మోదీ ఫోన్ చేసే దాకా తెలియ‌దు – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!