Ajay Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra )తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ దొరకడం చర్చ నీయాంశంగా మారింది.
ఈ తరుణంలో రైతులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అతడి బెయిల్ ను రద్దు చేయాలని. ఈ తరుణంలో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గా ఉన్న అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా పట్టించు కోలేదు.
ఇదిలా ఉండగా యూపీలో ఇవాళ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా(Ajay Mishra )తీవ్ర ఉద్రిక్తతల నడుమ లఖింపూర్ ఖేరిలో ఓటు హక్కు వినియోగించు కునేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన చుట్టూ పోలీసుల వలయం ఏర్పడింది. ఒక మంత్రికి ఇంత పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన ఏదో సాధించినట్లు విక్టరీ గుర్తు చూపించడం పుండు మీద కారం చల్లినట్లయింది.
ఇప్పటికే యూపీలో రైతులు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బడా బాబులు, డబ్బున్న వాళ్లకే కోర్టు కూడా బెయిల్ ఇస్తుందంటూ రైతు సంఘం అగ్ర నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు.
ఈ తరుణంలో అజయ్ మిశ్రా రావడం మరింత ఉద్రిక్తతకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా లిఖంపూర్ ఖేరిలో తన వాహనంతో తొక్కించి నలుగురిని పొట్టన పెట్టుకున్నాడని మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాపై బాధిత కుటుంబాలు ఆరోపించాయి.
Also Read : శశి థరూర్ సంచలన కామెంట్స్