Rahul Plane Denied : రాహుల్ విమానం దిగేందుకు అడ్డంకి

కావాల‌నే ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌న్న కాంగ్రెస్

Rahul Plane Denied : కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ప్ర‌ధానంగా త‌మ పార్టీకి చెందిన అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌యాణిస్తున్న విమానానికి కావాల‌ని వార‌ణాసిలో దిగేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది. ఇది పూర్తిగా ఉద్దేశ పూర్వ‌కంగా చేశారంటూ పేర్కొంది.

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అజ‌య్ రాయ్ మంగ‌ళ‌వారం మాట్లాడారు. ఎయిర్ పోర్టు అధికారులు ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల‌నే విమానం దిగేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ(Rahul Plane Denied) ఫ్లైట్ వార‌ణాసి లోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ అయ్యేందుకు ఒప్పు కోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇది పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప‌ర్య‌ట‌న‌ను సాకుగా చూపించి రాహుల్ విమానం దిగేందుకు అడ్డు చెప్పారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అజ‌య్ రాయ్.

రాత్రి దిగాల్సి ఉంద‌ని కావాల‌ని ఇలా చేశారంటూ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఇక్క‌డికి వ‌చ్చి..అక్క‌డి నుంచి ప్ర‌యాగ్ రాజ్ కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ఒత్తిడి కార‌ణంగానే ఆయ‌న ఫ్లైట్ ఎయిర్ పోర్టులో లాండింగ్ కాలేక పోయింద‌న్నారు.

దీనికి విచిత్ర‌మైన కార‌ణం చెప్పార‌ని ఎద్దేవా చేశారు. విమానాల క‌ద‌లిక‌, ట్రాఫిక్ ర‌ద్దీ కార‌ణంగా రాహుల్ గాంధీ ఫ్లైట్ కు(Rahul Plane Denied)  ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెప్పార‌ని అన్నారు. అలాంట‌ప్పుడు మిగతా ఫ్లైట్స్ ను ఎలా అనుమ‌తించారంటూ అజ‌య్ రాయ్ ప్ర‌శ్నించారు. ఇదంతా కావాల‌ని చేసిన కుట్ర‌గా ఆయ‌న ఫైర్ అయ్యారు.

Also Read : అదానీ వివాదం అమిత్ షా మౌనం

Leave A Reply

Your Email Id will not be published!