Ajit Doval : ఉగ్ర‌వాదంపై ఉమ్మ‌డి పోరు సాగించాలి

పిలుపునిచ్చిన భ‌ద్ర‌తా స‌ల‌హాదారు ధోవ‌ల్

Ajit Doval : ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డానికి క‌లిసిక‌ట్టుగా పోరాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్. ప్ర‌పంచ భ‌ద్ర‌త‌కు ప్ర‌స్తుతం టెర్ర‌రిజం ఓ పెను స‌వాల్ గా మారింద‌న్నారు.

ఆఫ్గ‌నిస్తాన్ లో మౌలిక స‌దుపాయాలు, క‌నెక్టివిటీ, మాన‌వ‌తా స‌హాయంపై ద‌శాబ్దాలుగా భార‌త‌దేశం దృష్టిని ధోవ‌ల్ హైలెట్ చేశారు.

అజిత్ దోవ‌ల్(Ajit Doval) శుక్ర‌వారం చైనాతో స‌హా మ‌రో ఏడు దేశాల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లో పాల్గొనే దేశాల‌ను కోరారు.

ప్రాంతీయ శాంతి, భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే ఉగ్ర‌వాదం, ఉగ్ర‌వాద గ్రూపుల‌ను ఎదుర్కోవ‌డంలో ఆఫ్గ‌నిస్తాన్ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని కోరారు.

జీవించే హ‌క్కు, గౌర ప్ర‌ద‌మైన జీవితం, మానవ హ‌క్కులు, స‌హాయం చేయ‌డం అన్న‌ది ప్రాధాన్యం కావాల‌ని సూచించారు అజిత్ దోవ‌ల్. త‌జ‌కిస్తాన్ , ఇండియా, ర‌ష్యా , క‌జ‌కిస్తాన్ , ఉజ్బెకిస్తాన్ , ఇరాన్ , కిర్గిజ్స్తాన్ , చైనా నుండి ఎన్ఎస్ఏ ల స‌మావేశం జ‌రిగింది.

ఈ కీల‌క స‌మావేశంలో భార‌త దేశ భ‌ద‌త్రా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇస్లామిక్ రిప‌బ్లిక్ లో శాంతి, స్థిర‌త్వాన్ని నిర్దారించేందుకు నిర్మాణాత్మ‌క మార్గాల‌ను క‌నుగొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

తాలిబాన్ , ఆఫ్గ‌నిస్తాన్ చారిత్ర‌క‌, నాగ‌రిక‌త సంబంధాలు భార‌త దేశం విధానానికి మార్గ‌ద‌ర్శ‌కంగా కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు అజిత్ దోవ‌ల్(Ajit Doval).

తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్న త‌ర్వాత ఆఫ్గ‌నిస్తాన్ కు 17000 మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను 50 వేల మెట్రిక్ ట‌న్నులు, 5,00,000 డోసుల కోవాక్సిన్ , 13 ట‌న్నుల అవ‌స‌ర‌మైన ప్రాణాల‌ను ర‌క్షించే మందులు, శీతాకాలపు దుస్తులు అంద‌జేశామ‌ని తెలిపారు.

ఏ స‌మాజానికైనా మ‌హిళ‌లు, యువ‌త కీల‌కం అన్నారు దోవ‌ల్.

Also Read : కాల్పుల క‌ల‌క‌లం బైడెన్ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!