Amit Shah : అమిత్ షాతో అజిత్ దోవల్ అత్యవసర భేటీ
కాశ్మీర లో వరుస కాల్పులపై చర్చ
Amit Shah : కాశ్మీర్ లో వరుస కాల్పులు జరుగుతుండడంతో కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరిని కాల్చి చంపారు ఉగ్రవాదులు. కుల్గామ్ ఉన్నత పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న టీచర్ బయటకు వస్తుండగా కాల్పులకు తెగబడ్డారు.
ఆమె అక్కడికక్కడే మరణించింది. తాజాగా ఇదే కుల్గామ్ లో ఓ ఉగ్రవాది బ్యాంక్ లోకి వచ్చి నేరుగా ఇటీవలే రాజస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన మేనేజర్ విజయ్ కుమార్ పై కాల్పులకు తెగబడ్డాడు.
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో కాశ్మీర్ వాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. మరో ఘటనలో ఆర్మీ ప్రయానిస్తున్న వాహనం పేలుడుకు గురైంది.
ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా వరుస కాల్పులకు తెగబడుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) అజిత్ దోవల్ తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయంకు చెందిన డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది.
ప్రధాన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న కాల్పుల ఘటనలపైనే ఎక్కువగా ఆరా తీసినట్లు సమాచారం.
Also Read : తెలంగాణకు మోదీ..రాహుల్ గ్రీటింగ్స్