Ajit Pawar Revolt : 30 మంది ఎమ్మెల్యేలతో అజిత్ జంప్
గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యేలు
Ajit Pawar Revolt : మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన 29 మంది ఎమ్మెల్యేలతో బాబాయి పై తిరుగుబాటు ప్రకటించారు. ఆదివారం ఏక్ నాథ్ షిండే సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అజిత్ పవార్(Ajit Pawar). గవర్నర్ ను కలవడం, ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఎన్సీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిప్యూటీ సీఎం లేదా ఆర్థిక శాఖ ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరాఠాలో బలంగా ఉన్న ఆయా పార్టీలను చీల్చే పనిలో సక్సెస్ అయ్యింది భారతీయ జనతా పార్టీ.
గతంలో బీజేపీ, శివ సేన కలిసి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత విడి పోయాయి. కాంగ్రెస్ , ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో శివసేన పార్టీలో చీలిక ఏర్పడింది. ప్రభుత్వం పడి పోయింది. వీరి స్థానంలో శివసేన తిరుగుబాటు అభ్యర్థి షిండే , బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్సీపీలో చోటు చేసుకున్న తిరుగుబాటుపై ఇంకా స్పందించ లేదు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో తిరుగుబాటు చేయడాన్ని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు ఎన్సీపీ చీఫ్.
Also Read : Komatireddy Venkat Reddy : సభపై ఆంక్షలు తగదు