Akbaruddin Owaisi KTR : బ‌రిలో ఉంటం బ‌రాబ‌ర్ గెలుస్తం

అక్బ‌రుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్

Akbaruddin Owaisi KTR : అసెంబ్లీలో ఐఎంఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల యుద్దం న‌డిచింది. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే స్వ‌రాన్ని పెంచారు. రాష్ట్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాట‌ల్ని ఏ ఒక్క‌టి నెర‌వేర్చ లేద‌ని ఆరోపించారు అక్బ‌రుద్దీన్.

త‌మ పార్టీకి ఏడుగురే ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ ఏడు మందిమే ఉండ‌వ‌చ్చు..కానీ రేపొద్దున 15 మంది ఎమ్మెల్యేల‌తో వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు అసెంబ్లీ సాక్షిగా. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుంద‌న్నారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. శాస‌న స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే వ‌ర్సెస్ మినిష్ట‌ర్(Akbaruddin Owaisi KTR) మ‌ధ్య ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. చివ‌ర‌కు స్పీక‌ర్ జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం స‌మిసింది. మాయ మాట‌లు చెప్ప‌డంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరి తేరింద‌న్నారు. అసెంబ్లీలో అన్నీ చెబుతారు కానీ ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌ర‌న్నారు. పాత‌బ‌స్తీని ఇస్తాంబుల్ లాగా చేస్తామ‌న్నారు.

క‌నీసం రోడ్లు వేసిన పాపాన పోలేద‌న్నారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. మెట్రో సంగ‌తి ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. రోజు రోజుకు న‌గ‌రంలో నేరాల సంఖ్య పెరుగుతోంద‌న్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అవి స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డం లేద‌ని ఆరోపించారు ఎమ్మెల్యే.

ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని ఆ త‌ర్వాత కొత్త హామీలు ఇద్దురు గాని అంటూ ఎద్దేవా చేశారు. పాత‌బ‌స్తీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఏం ఇచ్చారో స‌భా ముఖంగా చెప్పాల‌ని అక్బ‌రుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

Also Read : మోదీ పాల‌న‌లో దేశం వెనక‌కు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!