Shaheen Afridi Wedding : ఇంటి వాడైన పాక్ స్టార్ పేస‌ర్

అఫ్రిదీ కూతురుతో ష‌హీన్ నిఖా

Shaheen Afridi Wedding : పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ ష‌హీన్ అఫ్రిది ఓ ఇంటి వాడ‌య్యాడు. అమ్మాయి ఎవ‌రో కాదు పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయ‌ర్ ష‌హీద్ అఫ్ర‌ది కూతురు అన్షా. ఇదిలా ఉండ‌గా ష‌హీన్ , అన్షా ఇద్ద‌రికీ ఎంగేజ్ మెంట్ కుదిరి రెండు సంవ‌త్స‌రాలైంది. ఆమెకు చ‌దువు కునేందుకు అడ్డంకిగా ఉండ‌డం ఇదే స‌మ‌యంలో ష‌హీన్ అఫ్రిదీకి క్రికెట్ షెడ్యూల్ లో బిజీగా ఉండ‌డంతో కుద‌ర‌లేదు.

ఎట్ట‌కేల‌కు సుదీర్ఘ విరామం త‌ర్వాత పెద్ద‌ల సమ‌క్షంలో ష‌హీన్ అఫ్రిది , అన్హా ఒక్క‌ట‌య్యారు(Shaheen Afridi Wedding). పాకిస్తాన్ లోని క‌రాచీ న‌గ‌రంలో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి వేడుక‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి కుటుంబీకులు, బంధువులు, స‌న్నిహితులతో పాటు స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు కూడా భారీగా హాజ‌ర‌య్యారు.

పాకిస్తాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజం, స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ , షాదాబ్ ఖాన్ , హ‌ఫీజ్ , మాజీ శిక్ష‌కుడు స‌క్లైన్ ముస్తాక్ హాజ‌రైన వారిలో ఉన్నాన‌రు. ప్ర‌స్తుతం పాకిస్తాన్ టీంకు ఎలాంటి మ్యాచ్ లు లేవు. కొంద‌రు ఆట‌గాళ్లు ఇత‌ర దేశాల‌లో జ‌రిగే లీగ్ ల‌లో ఆడారు. మొన్న‌టి దాకా ష‌హన్ అఫ్రిదీ బంగ్లా దీస్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడాడు. వీరి పెళ్లికోసం త‌న దేశానికి తిరిగి వ‌చ్చాడు.

కాగా షహీన్ అన్షాల పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వీడియో కూడా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా ష‌హీన్ అద్బుత‌మైన బౌల‌ర్ గా పేరొందాడు. పాకిస్తాన్ సాధించిన విజ‌యాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు ష‌హీన్ అఫ్రిది.

Also Read : జై షాతో న‌జామ్ సేథీ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!