Jay Shah Najam Sethi : జై షాతో న‌జామ్ సేథీ భేటీ

ఆసియా క‌ప్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ

Jay Shah Najam Sethi : ఆసియా క‌ప్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. గ‌త ఏడాది శ్రీ‌లంక‌లో నిర్వ‌హించాల్సి ఉండ‌గా, ఆ దేశంలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త , ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో శ్రీ‌లంక ప్ర‌భుత్వం ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు తాము నిర్వ‌హించ లేమంటూ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఇదే విష‌యాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి విన్న‌వించింది.

దీంతో దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించారు ఆసియా క‌ప్ ను. ఇక ఈసారి ఆసియా క‌ప్ ను పాకిస్తాన్ నిర్వ‌హించాల్సి ఉంది. అయితే భార‌త జ‌ట్టు పాల్గొనే ప్ర‌స‌క్తి లేదంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా(Jay Shah Najam Sethi) స్ప‌ష్టం చేశారు. గ‌త కొన్నేళ్లుగా భారత్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా ఆట‌గాళ్ల‌కు భ‌ద్ర‌త కార‌ణాల రీత్యా తాము ఆడేది లేదంటూ పేర్కొంది.

ఒక‌వేళ త‌ట‌స్థ వేదిక‌లో ఎక్క‌డ నిర్వ‌హించినా తాము ఓకే అని, అయినా అందుకు కూడా ఆలోచించి చెబుతామ‌ని పేర్కొంది బీసీసీఐ. ఇక పాకిస్తాన్ లో ప్ర‌భుత్వం మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ కూడా మారారు. ర‌మీజ్ ర‌జా స్థానంలో న‌జామ్ సేథీ వ‌చ్చారు. మ‌రో వైపు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో కొన‌సాగ‌నుంది. దీనికి బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

మాజీ పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా భార‌త్ గ‌నుక ఆసియా క‌ప్ లో పాల్గొనక పోతే తాము వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొన బోమంటూ ప్ర‌క‌టించారు. దీంతో ఇరు దేశాల మ‌ధ్య కేవ‌లం త‌ట‌స్థ వేదిక‌ల‌పైనే మ్యాచ్ లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం జే షా ఏసీసీ చైర్మ‌న్ గా కూడా ఉన్నాడు. పాకిస్తాన్ హోస్టింగ్ హ‌క్కుల విష‌యంపై జైషా తో(Jay Shah Najam Sethi) చ‌ర్చించారు . ఆసియా క‌ప్ ను పాక్ లో కాకుండా యూఏఈ లేదా శ్రీ‌లంక‌లో నిర్వ‌హించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

Also Read : భార‌త్ లో టెస్టు క్రికెట్ కు నిరాద‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!