Akhilesh Yadav : రామ్ చరిత్ మానస్ కు వ్యతిరేకం కాదు
ఎస్పీ చీఫ్ ,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav Ramcharitmanas : యూపీలో గత కొంత కాలంగా ప్రముఖ కవి తులసీ దాస్ రాసిన రామ్ చరిత్ మానస్ పై వివాదం కొనసాగుతోంది. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నిప్పులు చెరిగారు. ఆయన యూపీ మాజీ సీఎం, మాజీ ఎస్పీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ను ఏకి పారేశారు. వీరంతా హిందూ వ్యతిరేకులని ఆరోపించారు.
అందుకే తాను పవర్ లోకి వచ్చాక బుల్ డోజర్లను దించానని, రాష్ట్రంలో నేరస్తులను పెంచి పోషించిన ఘనత సమాజ్ వాదీ పార్టీకే దక్కుతుందని సంచలన ఆరోపణలు చేశారు. నేరాలు లేకుండా చేయడమే తన ముందున్న లక్ష్యమని ప్రకటించారు.
హిందూ మతాన్ని ఎవరు కించ పరిచినా తాను ఊరుకోబోనంటూ హెచ్చరించారు. ఈ తరుణంలో రామ్ చరిత్ మానస్ పై వివాదం చోటు చేసుకుంది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.
తాను తులసీదాస్ రాసిన రామ్ చరిత్ మానస్ కు వ్యతిరేకం కాదని స్పష్టం (Akhilesh Yadav Ramcharitmanas) చేశారు. కానీ పదే పదే యోగి ఆదిత్యానాథ్ తనను వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
అయితే హిందూ ఇతిహాసానికి సంబంధించిన ఒక నిర్దిష్ట పద్యం మీద మాత్రమే అభ్యంతరం తెలిపామని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా మీరు విరాళాలు సేకరించారు. ఇది తప్పు కాదా..ఏ దేవుడు చెప్పాడు విరాళాలు వసూలు చేయమని అంటూ ప్రశ్నించారు.
Also Read : ఆర్థిక నేరగాళ్లకు మోదీ సపోర్ట్ – రబ్రీ దేవి