Akhilesh Yadav : యూపీలో యోగి రాచరిక పాలన – అఖిలేష్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్రిక్తత
Akhilesh Yadav : యూపీలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాది పార్టీ చీఫ్, శాసనసభా పక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అఖిలేష్(Akhilesh Yadav) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
అసెంబ్లీ వరకు సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ర్యాలీ చేపట్టేందుకు యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో అటు బీజేపీ శ్రేణులు ఇటు ఎస్పీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
పరిస్థితి విషమించడంతో సీరియస్ అయ్యరు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తోందన్నారు.
రాచరిక పాలన సాగిస్తున్న యోగి ఆదిత్యానాథ్(CM Yogi) కు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. లక్నోలో ఎమ్మెల్యేల మార్చ్ మధ్య అఖిలేష్ యాదవ్ ధర్నా చేపట్టారు.
ప్రతిపక్షాల పరంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన లేదా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. కానీ పోలీసుల అండ చూసుకుని యోగి రెచ్చి పోతున్నారంటూ ధ్వజమెత్తారు.
న్యాయ బద్దంగా నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన తమకు అనుమతి ఇవ్వక పోవడం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు అఖిలేష్ యాదవ్, ప్రభుత్వం మమ్మల్ని శాసనసభకు వెళ్లనివ్వలేదు.
ఒక ఎమ్మెల్యే సంతాప సభలో పాల్గొనేందుకు కూడా పర్మిషన్ ఇవ్వక పోవడం దారుణమన్నారు. అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సోమవారం మీడియాతో మాట్లాడారు. దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ శాంతియుత నిరసనలో పాల్గొన్నారని చెప్పారు.
Also Read : 60 కాదు 4 వీడియోలు మాత్రమే – విర్క్