Akhilesh Yadav : యోగి పాలనలో రాష్ట్రం వెనుకంజ – అఖిలేష్
బీజేపీ అబద్దాలు చెప్పడంలో దిట్ట
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) నిప్పులు చెరిగారు. యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అభివృద్దిలో వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగం పెరిగిందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కేంద్రంలో మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో యోగి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు అఖిలేష్ యాదవ్.
భారతీయ జనతా పార్టీ అబద్దాలు చెప్పడంలో, ప్రజల్ని నమ్మించడంలో ఆరి తేరిందన్నారు. లేనిది ఉన్నట్టు చూపించడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, యువకులు, వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కరు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు మాజీ సీఎం.
యూపీ సీఎం ఒక్కరే కాదు బీజేపీకి చెందిన నాయకులంతా అబద్దాలను అలవాటుగా మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించడం, నచ్చని వారిని టార్గెట్ చేస్తూ బోల్డోజర్ల పేరుతో ఆస్తులను ధ్వంసం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ సీరియస్ అయ్యారు.
యోగి అజంగఢ్ లో జరిగిన ర్యాలీ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఒక్క నిజం మాట్లాడ లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆగ్రా – లక్నో ఎక్స్ ప్రెస్ వేని నిర్మించిందన్నారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
ఈ వే కోసం భూసేకరణ ఎస్పీ పాలనలో జరిగిందని, అలైన్ మెంట్ నిర్ణయించామన్నారు. అయితే బీజేపీ తన పనిని ఆపివేసి పేరు మర్చిందని ఆరోపించారు.
Also Read : ఎలా గెలవాలో చెస్ నేర్పుతుంది – మోదీ