Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా యూపీలో ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో బీజేపీ (BJP) మరోసారి పవర్ లోకి వచ్చింది.
ప్రజలను మోసం చేసి ఓట్లు కొల్లగొట్టిన ఘనత బీజేపీదేనంటూ మండిపడ్డారు. ఆయన మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పేదరికం నెలకొనేందుకు ప్రధాన కారణం సీఎం అంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన మల్టీ డైమెన్షల్ పేదరిక సూచీ ఈ విషయాన్ని ప్రకటించిందన్నారు. పేదరికంలో యూపీ అట్టడుగున ఉందని గుర్తు చేశారు.
కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ఎన్నికలయ్యాక ధరా భారం మోపడం షరా మామూలైందని మండిపడ్డారు.
దేశంలో అత్యంత పేదరికంతో తల్లడిల్లుతున్న మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒకటని దీనికి సంబంధించి వివరాలను ట్విట్టర్ వేదికగా అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్ స్పందించారు. పోషకాహార లేమి, శిశు మరణాల రేటు క్యాటగిరిలో యూపీ మూడో ర్యాంక్ సాధించడం దారుణమని పేర్కొన్నారు.
బీజేపీ (BJP) అనుసరిస్తున్న విధానాలు , తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏం సాధించారని ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రశ్నించారు.
పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రాలలో ఇండియాలో టాప్ లో బీహార్ , జార్ఖండ్ , యూపీలు నిలిచాయని తెలిపారు. ఈనెల 25న రెండోసారి యోగి సీఎంగా కొలువు తీరనుండడం విశేషం.
Also Read : ఆప్ మంత్రులు మామూలోళ్లు కాదప్పా