Akshata Murthy : అక్ష‌తా మూర్తి ..రిషి సున‌క్ స‌క్సెస్ సీక్రెట్

ఫ్యాష‌న్ డిజైన‌ర్ నుంచి బిలియ‌నీర్ దాకా

Akshata Murthy : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్ కొలువు తీరాక మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు ఆయ‌న స‌తీమ‌ణి అక్ష‌తా మూర్తి. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ భార‌తీయ ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, సుధా మూర్తిల ముద్దుల కూతురు. రిషి సున‌క్ తాత‌లు భార‌తీయ మూలాలు క‌లిగిన వ్య‌క్తి. పంజాబ్ కు చెందిన వారు.

ప్ర‌ధాన‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం వెనుక అక్ష‌తా మూర్తి(Akshata Murthy)  ఉన్నార‌నేది నిజం. ఫ్యాష‌న్ డిజైర్ నుంచి బిలియ‌నీర్ దాకా ఎదిగారు. నారాయ‌ణ మూర్తి 1981లో ఇన్ఫోసిస్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు $76 బిలియ‌న్ల విలువైన అవుట్ సోర్సింగ్ సేవ‌లు అంద‌జేస్తోంది. ఫార్చ్చూన్ మ్యాగ‌జైన్ 2012 12 మంది గొప్ప పారిశ్రామిక‌వేత్త‌ల జాబితాలో ఉన్న ఇద్ద‌రు నాన్ అమెరిక‌న్ల‌లో ఒక‌రు.

వామ‌ప‌క్ష వాది నుండి దృఢ‌మైన పెట్టుబ‌డిదారీగా మార్చింది నారాయ‌ణ‌మూర్తి. ఇదిలా ఉండగా బ్రిట‌న్ పీఎం రిషి సున‌క్ అత్త సుధా నారాయ‌ణ మూర్తి టాటా మోటార్స్ లో మొద‌టి మ‌హిళా ఇంజ‌నీర్ గా ప‌ని చేశారు. లేడీ అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ టాటా సంస్థ ప్ర‌క‌ట‌న చేయ‌డాన్ని ఆమె స‌వాల్ చేశారు.

పోస్ట్ కార్డు ద్వారా త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు టాటా సంస్థ దిగి వ‌చ్చింది. సుధా మూర్తిని తీసుకుంది. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ ను స్థాపించి వేలాది మందికి విద్యా దానం చేస్తున్నారు. అన్నార్థుల ఆక‌లి తీరుస్తున్నారు. ర‌చ‌యిత్రిగా, మోటివేట‌ర్ గా పేరొందారు. సామాజిక సేవ‌లో 60,000 గ్రంథాల‌యాల‌ను నెలకొల్పారు.

6,000 మ‌రుగుదొడ్ల‌ను నిర్మించారు. త‌న పిల్ల‌లు అక్ష‌త‌, రోహ‌న్ ల‌కు క‌ష్టం అంటే ఏమిటో నేర్పించింది. 2009లో అక్ష‌తా మూర్తి రిషి సున‌క్ ల పెళ్లి జ‌రిగింది. వేయి మంది ప్ర‌ముఖులు , రాజ‌కీయ నాయ‌కులు, క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. ఇన్ఫోసిస్ లో అక్ష‌తా మూర్తి(Akshata Murthy)  వాటా విలువ దాదాపు $700 మిలియ‌న్లు.

ఆమె దివంగ‌త క్వీన్ ఎలిజ‌బెత్ – II కంటే ధ‌న‌వంతురాలిగా నిలిచారు. ఆమె వ్య‌క్తిగ‌త సంప‌ద 2021 సండే టైమ్స్ లో ప్ర‌క‌టించిన మేర‌కు $460 మిలియ‌న్లు. 42 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఆమె ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో 10 మిలియ‌న్ల డివిడెండ్ ను సంపాదించింది.

2010లో ఫ్యాష‌న్ లేబుల్ అక్ష‌తా డిజైన్స్ ని ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం దీని ద్వారా కోట్లు సంపాదిస్తోంది అక్షతా మూర్తి. ఏది ఏమైనా రిషి సున‌క్ వెనుక అస‌లు ర‌హ‌స్యం ఆమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : దేశం కోసం క‌లిసి న‌డుద్దాం

Leave A Reply

Your Email Id will not be published!