Akunuri Murali : ఓటేయండి డెమోక్రసీని కాపాడండి
పిలుపునిచ్చిన ఎస్డీఎఫ్ కన్వీనర్ మురళి
Akunuri Murali : హైదరాబాద్ – నిర్భయంగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి. గురువారం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
Akunuri Murali Words
ఎక్కడా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమేనని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali). అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పూర్తిగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ బక్వాస్ గా మారిందన్నారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటినీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 2 లక్షలకు పైగా కొలువులు ఖాళీగా ఉన్నా ఒక్కటి కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు.
Also Read : JR NTR : ఓటు వేసిన సినీ ప్రముఖులు