Akunuri Murali : ఆకునూరి కామెంట్స్ కలకలం
స్మితా సబర్వాల్ పై సీరియస్
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీఎంఓ కార్యదర్శగా ఉన్న స్మితా సబర్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. దేశంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ హెలికాప్టర్ లో తిరిగిన దాఖలాలు లేవన్నారు.
Akunuri Murali Comments Viral
గతంలో కొలువుతీరిన కేసీఆర్ సర్కార్ లో పోస్టులు అనుభవించిన ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రజల తరపున తన గొంతును వినిపిస్తూ వచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా జాగో తెలంగాణ పేరుతో ఆకునూరి మురళి(Akunuri Murali) పర్యటించారు.
ప్రధానంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్మితా సబర్వాల్ , అరవింద్ కుమార్, జయేశ్ రంజన్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరూ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో వీరిని వదల కూడదని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు ఆకునూరి మురళి.
ప్రధానంగా స్మితా సబర్వాల్ గురించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు . ఒక ఆఫీసర్ గా ఉంటూ ఎలా పవర్ ను ఎంజాయ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటో , దాని వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మేలు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ పై ఉందని పేర్కొన్నారు.
Also Read : CM Revanth Reddy : హైదరాబాద్ అభివృద్దిపై సీఎం ఫోకస్