Akunuri Murali : నడిగడ్డ హక్కుల కోసం పోరాటం
సంఘీభావం తెలిపిన ఆకునూరి మురళి
Akunuri Murali Gadwal : సోషల్ డెమోక్రటిక్ ఫోరం చీఫ్, మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. నిన్నటి దాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన గళం వినిపించారు. తాజాగా గద్వాల జిల్లా గట్టు లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వారితో పాటు ఆకునూరి మురళి కూడా జత కట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేద మండలంగా ఇప్పటికీ గట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్కడ ప్రాంతం ప్రజలు హక్కుల కోసం పోరాడటం బాధాకరమని పేర్కొన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali Gadwal). జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అతి పేద మండలంగా పేరు పొందడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. బడికి వెళ్లని బాల కార్మికులు, చిన్న చిన్న రేకులతో ఇండ్లు, పూరి గుడిసెలు , మహిళలు చెప్పులు లేకుండా బయటకు వెళ్లడం , ఇలా అభివృద్దికి ఆమడ దూరంలో ఉండడం పాలకుల వైఫల్యమేనని ఆరోపించారు.
దేశానికి 75 ఏళ్లవుతోంది స్వేచ్ఛ లభించి. ఇలాంటి పల్లెలు, ప్రాంతాలు, మండలాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా గద్వాల జిల్లాలో ఆవేదనకు లోనవుతున్న, సమస్యలతో సతమతం అవుతున్న నడిగడ్డ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సర్కార్ పై ఉందని స్పష్టం చేశారు ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి. లీకులు, స్కామ్ లు , అత్యాచారాలకు తెలంగాణ కేరాఫ్ గా మారిందన్నారు ఎస్డీఎఫ్ కన్వీనర్.
Also Read : భావోద్వేగాలతో ఆడుకోకండి – కేటీఆర్